నిర్మల్ : ఇందిరమ్మ ఇల్లు (Indiramma House) మంజూరు చేయాలని బైంసా మండలం దీగాం గ్రామానికి చెందిన గంగామణి అనే మహిళ ఆత్మహత్యాయత్నం(Suicide Attemp) చేసింది. కొన్ని రోజులుగా తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుంది. సాయంత్రం కలెక్టరేట్ కార్యాలయంలో రెండవ అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి దూకేందుకు యత్నించింది. గమనించిన కలెక్టరేట్ సిబ్బంది ఆమెకు నచ్చజెప్పి కిందికి తీసుకొచ్చారు.