నిండుకుండలా చెరువులు.. నీటి మధ్యన కలవపూలు.. చుట్టూ పచ్చని పొలాలు.. చెట్లపై కొంగల ఆటలు.. దూరంగా ఉన్న కొండపై కమ్ముకున్న మేఘాలు.. దండేపల్లి మండలం రెబ్బనపల్లి, లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో కనిపించే ఈ ప్రకృతి రమణీయ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.
స్వరాష్ట్రంలో రాష్ట్ర సర్కారు చేపట్టిన మిషన్కాకతీయతో ఆయా ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతూ కోనసీమను తలపిస్తున్నాయి. – మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్