నార్నూర్ : పంచాయతీ ఎన్నికల్లో గెలుపే బీఆర్ఎస్ ( BRS ) పార్టీకి కొండంత బలమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ( MLA Kovalakshmi ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ( Narnoor ) మండలానికి చెందిన మాన్కాపూర్, గంగాపూర్, మహాగావ్, బేతాల్ గూడ, జామడ, గుంజాల, మాలేపూర్ పంచాయతీలకు చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు శనివారం కొమురం భీం జిల్లా (అసిఫాబాద్) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ.. కష్టపడి ప్రజల సహకారంతో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా నిధుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కోట్లాడైనా నిధులు తీసుకువచ్చి పంచాయతీల అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్, రాయి సెంటర్ జిల్లా సార్ మేడి మేస్రం దుర్గుపటేల్, మాజీ ఎంపీపీ మేస్రం రూప్ దేవ్, నాయకులు ఉర్వేత రూప్ దేవ్,సయ్యద్ ఖాసిం, రాథోడ్ దిగంబర్,మాల్కుపటేల్ తదితరులున్నారు.