కడెం : మండలంలోని దిల్దార్ నగర్ గ్రామ సమీపాన ఉన్న అక్కొండ లక్ష్మీ నరసింహ స్వామిని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ( MLA Vedma Bojju Patel ) దర్శించుకున్నారు. జాతర మహోత్సవంలో భాగంగా ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
ప్రజలకు ఏ సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని,ఆ సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లపుడూ ఉండాలని, ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు వివరించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.