మధిర, ఆగస్టు 28: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని మధిర, బోనకల్లు, ముదిగొండ మండలాలకు చెందిన 24 మంది మైనార్టీ లబ్ధిదారులకు రూ. లక్ష రూపాయల చెక్కులను ఆయన స్థానిక ఎమ్మెల్యే భట్టితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పరిపాలన అందిస్తున్నారని, అన్ని వర్గాల వారికి ప్రభుత్వ పథకాలు అందిస్తూ, అన్ని పండుగలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ప్రతిఒక్కరూ సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి మూడోసారి సీఎంని చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండెం లలిత, మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, మార్కెట్ కమిటీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ గుర్రం రామారావు, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఎంపీడీవోలు షేక్ సిలార్సాహేబ్, కౌన్సిలర్ ఇక్బాల్, నాయకులు శ్రీనివాసరావు, కృష్ణప్రసాద్, బయ్యవరపు అశోక్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.
మధిర ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచి గ్రామాలను కనెత్తి చూడని భట్టి విక్రమార్కను ఈ సారి ఎన్నికల్లో ఓడించాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. సోమవారం మండలంలోని వంగవీడు గ్రామంలో పలు పార్టీల నుంచి 50 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ జడ్పీ చైర్మన్ కమల్‌రాజు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మధిర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, ప్రజలంతా దీవించి ఆశీర్వదించాలని కోరారు. ఏనాడు గ్రామాల్లో కనిపించని భట్టివిక్రమార్క మళ్లీ ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించేందుకు, ప్రజలను మోసగించేందుకు వస్తున్నారని, ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బొగ్గుల పద్మావతి, ఉపసర్పంచ్ దర్శి మురళీ, మాజీ జడ్పీటీసీ మూడ్ ప్రియాంక, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బంధం శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ గుర్రం రామారావు, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రావూరి శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు, నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, కటికల సత్యనారాయణరెడ్డి, అరిగె శ్రీనివాసరావు, యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు కోన నరేందర్‌రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు అబ్బూరి రామన్, బొగ్గుల వీరారెడ్డి, గద్దల రాజా, వార్డు సభ్యులు తోటమూల శాంతయ్య, అరుణ, సుశీల, గుడిదె నాగమణి పాల్గొన్నారు.