సిరికొండ, అక్టోబర్ 6 : పేదలందరూ అభివృద్ధి చెందేలా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పొన్న సర్పంచ్ చంద్రకళ అన్నారు. మండలలోని పొన్న గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు నూతన పింఛన్ డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 28 మందికి నూతన పింఛన్ డబ్బులు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సువర్ణబాయి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
బేల, అక్టోబర్ 6 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సర్పంచ్ ఇంద్రశేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా 111 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు వచ్చాయని, మిగతా వారికి రెండో విడుతలో వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో మణియార్పూర్ సర్పంచ్ వాడ్కర్ తేజ్రావ్, పంచాయతీ కార్యదర్శి సురేశ్, వార్డు సభ్యులు సచిన్, దేవీదాస్, ఆకాశ్ గుండావార్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఆసరా పింఛన్లు
తాంసి, అక్టోబర్ 6 : రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందిస్తున్నదని సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని వడ్డాడి గ్రామంలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పహీం, వీడీసీ చైర్మన్ ప్రకాశ్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.