తాంసి, ఏప్రిల్ 18 : ఎకరానికి 15 క్వింటాళ్ల చొప్పున జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడుతానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తాంసి మండల కేంద్రంలో మార్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జొన్న రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలను మోసం చేసి గద్దెనెకి హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సురకుంటి మంజుల శ్రీధర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ రఘు, సీఈవో కేశవ్, మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాశ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, నాయకులు మహేందర్, రజినీకాంత్ రెడ్డి, లక్ష్మీపతి, వినోద్ రెడ్డి, సంతోష్, గడుగు గంగన్న, రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.