కాసిపేట : ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లే అవుతుంది. ఇంకా మూడేళ్ల సమయం ఉందని, ఇచ్చిన ప్రతి హామీలు (Congress Promises) నెరవేరుస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ ( Ratnam Pradeep) పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొండాపూర్ యాపలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకుంటుందన్నారు. ఏ ఊరుకి వెళ్లినా ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై చేసే ఆరోపణలు, విమర్శలను నమ్మవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ రౌతు సత్తయ్య, ప్రధాన కార్యదర్శి మైదం రమేష్, ఎస్సీ అధ్యక్షులు గోలేటి స్వామి, దుర్గం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.