కుభీర్ : భారతీయ తపాలా జీవిత బీమా ( Postal Life Insurance ) భారతీయ పౌరులకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు దోహద పడుతుందని కుభీర్ పోస్ట్ ఆఫీస్ సీనియర్ బీపీఎం పుప్పాల రాజేశ్వర్ ( BPM Rajeshwar ) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అసిస్టెంట్ బీపీఎం బీ. నవీన్ తో కలిసి నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పార్డి (కే) గ్రామంలో ఇంటింటికి తిరిగి గ్రామస్థులకు భారతీయ పోస్టల్ బీమా పథకాలపై అవగాహన ( Aware ) కల్పించారు. రోజువారితో పాటు క్వార్టర్లీ, ఆఫ్ ఇయర్లీ, ఇయర్లీ ప్రీమియం చెల్లించు కోవచ్చన్నారు.
ఈ పథకాలు గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం రూపొందించబడ్డాయి. వీటికి పెట్టుబడితో పాటు బీమా యొక్క ద్వంద్వ ప్రయోజనాలను అందిస్తాయి. ఈ పథకాలు పాలసీదారులకు జీవిత బీమాతో పాటు, మనీ-బ్యాక్, ఎండోమెంట్, మొత్తం జీవిత బీమా వంటి ప్రయోజనాలను అందిస్తాయని పేర్కొన్నారు. ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన, గ్రామీణ తపాలా బీమా, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పీఎల్ఐతో పాటు రికరింగ్ డిపాజిట్(RD), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC), కిసాన్ వికాస పత్ర(KVP), మహిళా సమాన్ సేవింగ్ పథకాలున్నాయని వివరించారు.
పోస్టల్ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు పొదుపు చేసుకొని ఆర్థిక భద్రతకు బాటలు వేసుకోవాలని కోరారు. గ్రామంలోని ప్రధాన కూడలిలో పథకాల గురించి వివరించి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఐపీపీబీ, ఎస్బీ ఖాతాలు, ఆడపిల్లల భద్రత కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాలను తీసుకున్నారు. ఫోన్ చేసిన వెంటనే ఇంటికి వచ్చి పోస్టల్ సేవలు అందిస్తామని ఆయన తెలిపారు.