మందమర్రి, జూలై 6 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల పోరాడాలని, ఈ నెల 9న చేపట్టనున్నట్లు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం సీఐటీయూ ఆధ్వర్యంలో మందమర్రిలో బైక్ ర్యాలీ తీశారు. మార్కెట్ ఏరియాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి బైక్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్ల పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయడంతో పాటు కార్మిక హక్కులను హరించేందుకు కుట్ర పన్నుతున్నదని సంకె రవి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దూలం శ్రీనివాస్, నాయకులు గందం రవి, తిరుపతి, సంగి పోషం, నిర్మల, రాజేంద్రప్రసాద్, రవీందర్, శ్రీధ ర్, రాయమల్లు, కొమురయ్య, తిరుపతి, నరేశ్, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
శ్రీరాంపూర్, జూలై 6 : శ్రీరాంపూర్‌లో ఐఎఫ్టీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మానందం సమ్మె పోస్టర్లు విడుదల చేశారు. నాయకులు అప్పారావు, శంకర్, సుధాక ర్, రాంబాబు, సురేశ్, రాము, సమ్మ య్య, రాజేశ్, విజయేందర్, శశి, మల్లేశ్వరి, శ్వేత, శిరీష, కవిత పాల్గొన్నారు.
బెల్లంపల్లి, జూలై 6 : బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తా వద్ద సింగరేణి జేఏసీ నాయకులు సార్వత్రిక సమ్మె పోస్టర్ విడుదల చేశారు. నాయకులు చాంద్‌పాషా, మణిరామ్‌సింగ్, నీరటి రాజన్న, అంబాల ఓదేల్, గోగర్ల శంకర్, మేకల రాజన్న, మల్లన్న పాల్గొన్నారు.
హాజీపూర్, జూలై 6 : సమ్మెలో జిల్లాలోని హమాలీ కార్మికులు పాల్గొనాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాశ్ పిలుపునిచ్చారు. గుడిపేట, హాజీపూర్, ముత్యంపేట, దొనబండ గ్రామా ల్లో గల రైస్ మిల్లుల్లోని హమాలీ కార్మికులను కలిసి, కరపత్రాలు విడుదల చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నయ్య, రవి, కొమురయ్య, గంగన్న, చందు, జయరాజ్, పద్మారావు, శ్రీనివాస్, నర్సయ్య, మల్లేశ్, జార్జ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జూలై 6 : సార్వత్రిక సమ్మెకు సీపీఎం పూర్తి మద్దతు తెలిపినట్లు పార్టీ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కార్యదర్శి కుశన్న రాజన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం దినకర్, కార్తిక్ ఉన్నారు.