సీసీసీ నస్పూర్, డిసెంబర్ 28 : సింగరేణి నివాస స్థలాలకు పట్టాలు అందజేసి, ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివార్రావు అన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలో 36 కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల కోసం ప్రజలు చాలా ప్రయత్నాలు చేశారని, 30 ఏండ్లుగా పట్టాల కోసం ఎదురుచూశారన్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి సింగరేణి అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారమైందని తెలిపారు.
లబ్ధిదారులు సంతోషంగా బిల్డింగులు కట్టుకోవాలని సూచించారు. చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు అందరూ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కౌన్సిలర్లు బండి పద్మ, వంగ తిరుపతి, కుర్మిళ్ల అన్నపూర్ణ, కేడీకే ప్రకాశ్‌రెడ్డి, చిడం మహేశ్, పంబాల గంగా, పూదరి కుమార్, జబీన్హైమద్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్, మాజీ సర్పంచులు మల్లెత్తుల రాజేంద్రపాణి, వేల్పుల రాజేశ్, నాయకులు దీకొండ అన్నయ్య, బండి రమేశ్, రౌతు రజిత, గర్శె భీమయ్య, పానుగంటి సత్తయ్య, పెర్క సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్మికవాడల్లో పర్యటన..
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కార్మిక వాడల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఆయనకు కాలనీవాసులు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. గోదావరికాలనీ షిర్కెలో ఇంటంటా తిరిగారు. వారి యోగక్షేమాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను కార్మిక కుటుంబాలు ఆయన దృష్టికి తీసుకురాగా, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్మిళ్ల అన్నపూర్ణమోహన్, మాజీ సర్పంచ్ కమలాకర్‌రావు, టీబీజీకేఎస్ నాయకులు కే సురేందర్‌రెడ్డి, అన్నయ్య, ఏనుగు రవీందర్‌రెడ్డి, మంద మల్లారెడ్డి, నాయకులు గర్శె రామస్వామి, జాబ్రిగౌస్, చిట్టంపల్లి నరేశ్, దగ్గుల మధు, ఎంబడి సమ్మయ్య, కాటం రాజు, తోకల సురేశ్, బోనాసి స్వామి తదితరులు పాల్గొన్నారు.