ఎదులాపురం, జనవరి 29 : అవార్డులు అనేవి పార్టీలకు సంబంధించినవి కావని, వారి గౌరవానికి, సృజనాత్మకతకు గుర్తింపుగా ఇచ్చేవని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గద్దర్‌కు ప్రకటించిన పద్మభూషణ్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. సంజయ్ మాటలు, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాటల మధ్య వ్యత్యాసంతో బీజేపీలో విభేదాలు బయట పడుతున్నాయన్నారు. కాంగ్రెస్-బీజేపీల ద్వంద్వ వైఖరితో గద్దర్ వంటి మహోన్నతమైన వ్యక్తి ప్రతిష్టతకు భంగం కలిగించొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు నారాయణ, ప్రహ్లాద్, తదితరులు పాల్గొన్నారు.