నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 24 ః హైదరాబాద్‌లోని కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నిర్మల్‌లోని అల్ఫోర్స్ విద్యాసంస్థలు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి అన్నారు. ఇంటర్మీడియట్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్లను గురువారం అల్ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాలలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ కళాశాలను నమ్మి తల్లిదండ్రులు మెరిట్ స్టూడెంట్లను అప్పజెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. అల్ఫోర్స్‌లో విద్యతోపాటు విలువలను అందిస్తున్నామని అన్నారు. మున్ముందు హైదరాబాద్ కళాశాలలకు దీటుగా అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరెన్నో మంచి ర్యాంకులు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులు..
ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో ఉమ్మడి జిల్లా టాపర్స్‌గా కృ ష్ణవేణి 468, జోసి ప్రసూన శ్రీ 468, కీర్తిశ్రీ 468, బాలు ర విభాగంలో శ్రీ చరణ్ 467, అఖిల్ 467, కార్తికేయన్ 467 మార్కులు సాధించారు. బైపీసీలో సామఫిర్దోస్, మహవీర్, నబిలా తహరీమ్ 438 మార్కులు సాధించారు. సెకండియర్ ఎంపీసీ, బైపీసీలో కమల్ ప్రీత్ కౌర్ 995, సుమయ ఖానం 994, జాదవ్ నవ్యశ్రీ 993 మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు.