rain | బజార్ హత్నూర్ : బజార్ హత్నూర్ మండలం లో అకాల వర్షం గాలి వాన బీభత్సవం సృష్టించింది. బుధవారం కురిసిన వర్షం తో అన్నదాత ఆగమాయ్యడు. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం తో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. పలు చోట్ల చెట్ల కొమ్మలు, విద్యుత్ తీగలు నేలపై పడ్డాయి. దీంతో పాటు మండల కేంద్రం లోని మార్కెట్ కేంద్రం లో భారీగా వర్షపు నీరు చేరడం తో రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
జొన్న బస్తాల మధ్య నీరు చేరడం తో నీటిని తొలగించేందుకు ఎన్నో అవస్థలు పడుతూ నీటిని తొలగొస్తూ ఉంటే మరో పక్క ఏడాతేరాపి లేకుండా కూరుస్తున్న వర్షం తో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని రైతులు వేడుకుంటున్నారు.