నార్నూర్, ఆగస్టు 09 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం భీంపూర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రాథోడ్ బాబూలాల్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. శనివారం తెర్వీ (పెద్దకర్మ) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ హాజరై బాబూలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా బాబూలాల్ అందించిన సేవలను కొనియాడారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, డి.ఎస్.పి చౌహాన్ రఘునాథ్, మాజీ ఎంపీటీసీ జాదవ్ రేణుక భాయి, మాజీ సర్పంచ్ రాథోడ్ విష్ణు, రాథోడ్ రాజు నాయక్, బానోత్ గజానంద్ నాయక్, ఎంఈఓ ఆడే ప్రకాశ్, సేవాలాల్ ధర్మ ప్రచారక్ ప్రేమ్ మహారాజ్, మాజీ జడ్పిటిసి రూపవతి జ్ఞానోబా పుష్కర్, నివాస్ మహారాజ్, గులాబ్ మహారాజ్, శివాజీ పటేల్ పాల్గొన్నారు.