లక్ష్మణచాంద/దిలావర్పూర్/సోన్/నర్సాపూర్(జి), నవంబర్ 24 : లక్ష్మణచాంద, దిలావర్పూర్, నిర్మల్, సోన్, నర్సాపూర్(జి) మండలాల్లో ఆదివారం ట్రెయినీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్లు పర్యటించారు. లక్ష్మణచాంద మండలంలోని పొట్టపెల్లి(కే) గ్రామంలో ట్రెయినీ ఐఏఎస్‌లు పర్యటించారు. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డులు, ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులు, కిచెన్ షెడ్డు, నర్సరీని పరిశీలించారు. వారి వెంట ఎంపీడీవో రాధిక, ఎంపీవో అమీర్‌ఖాన్, ఏపీవో ప్రమీల, ఏపీఎం వాణిశ్రీ ఉన్నారు.
క్షేత్రస్తాయి శిక్షణలో భాగంగా ఐదుగురు శిక్షణ ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు దిలావర్పూర్ మండలంలోని న్యూ లోలం గ్రామంలో పర్యటించారు. డ్వాక్రా మహిళ సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. అనంతరం నర్సరీ, పల్లె ప్రకృతి వనం, సెగ్రిగేషన్ షెడ్డును పరిశీలించారు. బీడీ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్న మహిళలతో ముచ్చటించి, బీడీలు ఎలా చుడుతారో తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో గోవర్ధన్, ఈజీఎస్ ఏపీవో దివ్యారెడ్డి, ఏఈవో మౌనిక, ఐకేపీ ఏపీఎం సులోచనరెడ్డి, ఐడీసీడీఎస్ సూపర్వైజర్ ప్రసన్నకుమారి, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్‌కుమార్, ఈజీఎస్ టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు రమణ, గోవిందుల మహేశ్, అంగన్వాడీ టీచర్లు కళావతి, ఐకేపీ సీసీలు ముత్యం, రాణి పాల్గొన్నారు.
నిర్మల్, సోన్ మండలాల్లోని నీలాయిపేట్, చిట్యాల్, బొప్పారం గ్రామాలను శిక్షణ ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్లు సందర్శించారు. సంక్షేమ పథకాలు, వ్యవసాయం, డ్వాక్రా గ్రూపు సభ్యుల గురించి తెలుసుకున్నారు. వైకుంఠధామాలు, నర్సరీలు, డంపింగ్ యార్డులు, పాఠశాల, ఇంకుడుగుంతలను పరిశీలించారు. చేలలోకి వెళ్లి పంటల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో సంతోష్, ఆర్ఐ మోహన్ పాల్గొన్నారు.
నర్సాపూర్ (జీ) మండలంలో కేజీబీవీ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఆశ, అంగన్వాడీలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. 30 పడకల ఆసుపత్రిని సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ విజయ లక్ష్మీ, ఎంపీడీవో పుష్పలత, ఎంపీవో తిరుపతిరెడ్డి, నాయబ్ తహసీల్దార్ వహీద్ పాల్గొన్నారు.