ఇంద్రవెల్లి : మండలంలోని ముత్నూరు గ్రామానికి చెందిన మస్కే నితేష్ ( Maske Nitesh ) అనే అంధ విద్యార్థికి గ్రామస్థులు చేయూతను (Financial Assistance) అందించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుకుంటూ కళాశాల హాస్టల్లో ఉంటున్న అతడు ఫీజు చెల్లించాల్సి ఉండగా ఆర్థిక పరిస్థితి బాగాలేక డబ్బులు చెల్లించలేకపోయాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్థులు దుర్వా సంతోష్, జైస్వాల్ మనోజ్ తమవంతు ఆర్థిక సహాయాన్ని విద్యార్థి నితేష్ కు అందజేసి, అండగా నిలిచారు. చదవాలనే ఆకాంక్ష ఉన్న విద్యార్థికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేయూతను అందించాలని గ్రామస్థులు కోరారు. ఈ కార్యక్రమంలో రంగుల రాజు, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.