మంచిర్యాల, జూలై 3 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు(హాస్టళ్ల)కు ఇకపై విజయ పాలు ఎంఆర్పీ ధరకే అందజేయనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సంక్షేమ హాస్టళ్లకు ఎంఆర్పీ రూ.60 ఉంటే, రూ. 62కు లీటర్ చొప్పున అందిస్తున్నారంటూ జూలై 1న ‘నమస్తే’లో ‘విజయ బాదుడు’ శీర్షికన కథనం ప్రచురితమైంది.
ఇందుకు స్పందించిన కలెక్టర్ విజయ డెయిరీ అధికారులతో మాట్లాడారు. ఎంఆర్పీ ధరకే పాలు అందజేయాలని సూచిం చారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లకు విజయ పాలు రూ.60కే లీటర్ చొప్పున ఇవ్వ నున్నట్లు స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టళ్ల అధికారులకు సైతం ఉత్తర్వులు జారీ చేశారు.