కాసిపేట, మార్చి 30 : కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెం చొప్పరిపల్లి చెక్‌పోస్ట్ వద్ద శనివారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. వరంగల్‌కు చెంది న గంట మహేశ్ వద్ద రూ.1,20,700, వరంగల్ కు చెందిన జరుపుల అమ్రు వద్ద రూ.2,75,000, దండేపల్లికి చెందిన వెంకటేశ్ వద్ద రూ.2,97,500 స్వాధీనం చేసుకున్నారు. నగుదును ఎస్ఎస్టీ టీంకు అప్పగించినట్లు ఎస్ఐ వివరించారు.
కోటపల్లి, మార్చి 30 : రాపనపల్లి గ్రామం సమీపంలోని అంతర్రాష్ట్ర వంతెన సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద రూ.1.82 లక్షలను పట్టుకున్నట్లు ఎస్ఎస్టీ టీం అధికారి పొన్న మల్లయ్య తెలిపారు. మహారాష్ట్రలోని అంకిస గ్రామానికి చెందిన కొఠారి ధర్మయ్య ఎలాంటి ఆధారాలు లేకండా మంచిర్యాలకు నగదు తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు వివరించారు.