ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని మార్వాడి ధర్మశాల శ్రీ వేంకటేశ్వరా ఆలయంలో భక్తులు సోమవారం వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే జోగు రామన్న దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవింద నామ స్మరణతో ఆలయం మార్మోగింది.
– ఆదిలాబాద్ టౌన్, జనవరి 2
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు ఉదయం నుంచే పోటెత్తగా, ఆలయాలు కిటకిటలాడాయి.
గోవింద నామస్మరణతో పరిసరాలు మారుమోగాయి. స్వామి వారికి అభిషేకాలు, పల్లకీసేవ, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.