మంచిర్యాల అర్బన్/నస్పూర్, జూలై 31 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తూ రిటైర్డ్ అయిన వంగ చక్రపాణిని తోటి అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆత్మీయ వీడోలు కార్యక్రమాన్ని నిర్వహించి శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.
మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు నరేందర్ రెడ్డి, కాంపెల్లి శంకర్, మహాత్మా సంతోశ్, పట్వర్ధన్ మాట్లాడుతూ చక్రపాణి 33 ఏళ్ల పాటు అందించిన సేవలు అభినందనీయమన్నారు. ఆయన ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఆయన తన శేష జీవితాన్ని కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు.