తలమడుగు : అందరి సహకారంతోనే కొవిడ్ వ్యాక్సినేషన్‌ను జిల్లాలో వందశాతం పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కరోనా ఉధృతి సమయంలో సేవలు అందించిన వైద్యం, , మీడియా సిబ్బందికి మండలంలోని ఉమ్రి గ్రామంలో మహరాష్ట్ర బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కాడే స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామంలోని కుమురం భీం విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడూతూ.. కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి అన్నారు.
ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, సర్పంచ్ గోపాల్, పటేల్ రామారావు, మాదవ్‌రావు, కాడేస్వామి, రిమ్స్ ఆర్ఎంవో డాక్టర్ చందు, జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ సాధన, తాసీల్దార్ ఇమ్రాన్‌ఖాన్, ఎంపీడీవో రమాకాంత్, వైద్య సిబ్బంది, యువజన సంఘాల సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.