హాజీపూర్, డిసెంబర్ 29 : నాల్గో తరగతి ఉద్యోగుల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గీట్లు సుమిత్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నాల్గో తరగతి ఉద్యోగుల సంఘ సమావేశం నిర్వహించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ ఎజెండాలో పొందుపర్చిన అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డీఏ, పీఆర్సీపై చర్చించి, ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గోవర్ధన్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.