అకాల వర్షం.. రైతన్నలకు నష్టం
దస్తురాబాద్ మండలంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిశాయి.
దస్తురాబాద్, మే 8 : దస్తురాబాద్ మండలంలో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిశాయి. అక్కడక్కడ కోతకు వచ్చిన వరి చేలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా రైతులు కవర్లు కప్పుతూ తిప్పలు పడ్డారు. శుక్రవారం ఆరబెట్టేందుకు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వడ్లు కొనాలని రైతులు కోరుతున్నారు.
లక్ష్మణచాంద మండలంలో..
లక్ష్మణచాంద, మే 8 : లక్ష్మణచాంద మండలంలో గురువారం రాత్రి కురిసిన వానతో కొనుగోలు వడ్లు, మక్కలు తడవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. పారుపెల్లి గ్రామంలో సబ్సెంటర్ పరిధిలో లారీల కొరత, గన్నీ బ్యాగులు, అధికారుల అలసత్వంతో మక్కలు, వడ్ల కొనుగోళ్లు జాప్యమవుతున్నాయని రైతులు తెలిపారు. 20 లారీలకు గాను 3 లారీలను మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు. 25 రోజులు క్రితం మక్కలు తీసుకువచ్చామని, ఇప్పటికీ కొనలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు మెరుగు గోపాల్, మధు, భీమేశ్ కోరారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

