అకాల వర్షం రైతన్నలకు కన్నీరే మిగిల్చింది. జిల్లాల్లోని వివిధ మండలాల్లో మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైంది. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం, అధికారులు వేగవంతం చేయకపోవడంతోనే తమకు ఈ దుస్థితి వచ్చిందని రైతులు ఆవేధన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల విద్యుత్ తీగలపై చెట్లకొమ్మలు విరిగి పడడంతో స్తంభాలు నేలకొరిగాయి. పలు ఇండ్ల గోడలు, రేకులు ఎగిరిపోయాయి.
మంచిర్యాలటౌన్, మే 6 : మంచిర్యాలలో మంగళవారం రాత్రి గాలివాన బీభ త్సం సృష్టించింది. మంచిర్యాలలోని సాయికుంట ఏరియాలోని ప్రభుత్వ బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ గేటు సమీపంలోని చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. అదే హాస్టల్‌కు మ రోపక్క ప్రహారీపై చెట్టు విరిగిపడింది. 11వ డివిజన్ గోదరివాడ మల్లన్న గుడి సమీపంలో చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి.
దండేపల్లి, మే 6 : మండలంలోని వివి ధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో తూకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిపోయా యి. తూకం వేసిన వడ్ల బస్తాల్లోకి నీరు చే రింది. అర్ధరాత్రి ధాన్యంపై కవర్లు కప్పేందుకు రైతాంగం అష్టకష్టాలు పడ్డారు. పలుచోట్ల విద్యూత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మంగళవారం రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నర్సాపూర్ గ్రామంలో చాతరాజు స్వామి ఇంటిపై కప్పు ఈదురుగాలులకు లేచిపోయింది.
కాసిపేట, మే 6 : మండలంలో గాలివాన బీభత్సంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలపై చెట్లు విరిగి పడడంతో విద్యుత్ పోల్స్ ఎక్కడికక్కడ విరిగిపోయాయి. తాటిగూడలో ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. లంబాడితండా(డీ)లో అజ్మీరా వినోద్‌కు చెందిన ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.
కన్నెపల్లి, మే 6 : మండలంలో గాలి వానతో లింగాల గ్రామంలో పలు ఇండ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. లింగాల గ్రామాన్ని తహసీల్దార్ రాంచందర్ పరిశీలించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.
మందమర్రి, మే 6 : మండల పరిధిలోని బొక్కలగుట్ట, సారంగపల్లి, పొన్నా రం, గుడిపెల్లి, వెంకటాపూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోళుల కేంద్రాల్లో పోసిన వడ్లు పూర్తిగా తడిపోయాయి. మండలంలోని మామిడితోటలలో మామిడికాయలు నేలరాలాయి.
నెన్నెల, మే 6 : రైతులు వరి పంట సాగుచేసి కోతలకు వచ్చిన పంటను నూర్పిడి చేసి కళ్లాలో ధాన్యం ఆర బోసినప్పటికీ కొనేవారు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాని, మండలంలోఎక్కడా ప్రభుత్వ పరంగా కేంద్రాలను ఇప్పటి వరకు ప్రారంభించలేదు. నెన్నెల, మన్నెగూడెం, మైలారం, జోగాపూర్, చితల్తాపూర్, గుండ్ల సోమారం,గంగారం, కొత్తూర్ గ్రామాల పరిధిలో పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంస్‌ల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది కాని, ఒక్కటి కూడా ఏర్పాటు కాలేదు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం కుప్పలు తడిసి దెబ్బతిన్నాయి. గొల్లపల్లి, జోఆపూర్, ఆవుడం, చిత్తాపూర్, నెన్నెల, మన్నెగూడెం గ్రామాల్లో కళ్లాలలో ఆర బోసి న ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి.

పిడుగుపాటుకు ధాన్యం దగ్ధం
పెంచికల్ పేట్, మే 6 : మండలంలోని ఎలపల్లి గ్రామానికి చెందిన జరుపుల శ్యామ్ రెండెకరాల వరి ధాన్యం కుప్ప పిడుగుపాటుకు దగ్ధమైంది. బుధవారం ఉద యం ఆర్ఐ రాజేశ్వర్ జీపీవో అనిల్ ఘట నా స్థలాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు. అదేవిధంగా ఎల్లూరు ఆశ్రమ ఉన్నత పాఠశాలలో భారీ వృక్షం విద్యార్థులు వ్యాయామం చేసుకునే ఇనుప పరికరాలపై పడడంతో చెట్టుతో పాటు వ్యాయా మ సామగ్రి నేలమట్టమయింది.
హాజీపూర్, మే 6 : మండలంలో ఐకేపీ ఆధ్వర్వంలో ధాన్యం, మక్కలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, రైతు లు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలలోనే రైతులు పండించిన పంట కుప్పలు తెప్పలుగా నిల్వ ఉన్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పంట ను కాపాడుకునేందుకు రైతులు ఎన్ని కష్టాలుపడ్డప్పటికీ అకాల వర్షంతో ధాన్యం తడి సి ముద్దయిందని రైతులు వాపోతున్నారు. నిర్వాహకులు టార్పాలిన్లు ఇవ్వక పోవడం, రైతులు వారు తీసుక వచ్చి కవర్లు గాలికి లేవడంతో వర్షం పాలయ్యాయన్నారు.
జైపూర్, మే 6: మండలంలోని వివిధ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చి 20 రోజులైనా ధాన్యాన్ని మిల్లులకు తరలింపులో అధికారుల జాప్యంతో మంగళవారం రాత్రి అకారణంగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దవడంతో పాటు నేల పాలలైంది. దీం తో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ గ్రామాల్లో తడిసిన దాన్యాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాములు స్థానిక తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి సందర్శించారు.
కోటపల్లి, మే 3 : కోటపల్లి మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు చేతికి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కోతకు వచ్చిన వరి పంట నేలకొరగగా, కల్లాలోని ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.
భీమారం, మే 6 : మండలంలో భీమా రం, కొత్తపల్లి, ఆరెపల్లి, దాంపూర్, ఖాజీపల్లి, బూరుగుపల్లి, గ్రామాల్లోని మామిడి కాయలు నేలరాలాయి. భారీ వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దకాగా, పంటను కాపాడుకునేందుకు రైతులు నానాకష్టాలు పడ్డారు.
చెన్నూర్ రూరల్, మే 6: మండలంలోని కిష్టంపేట, ఆస్నాద్, కొమ్మెర, చింతలపల్లి, నాగాపూర్, సోమన్‌పల్లి, బీరెల్లి, పొక్కూర్, నాగాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అంతా తడిసిపోవడంతో రైతులంత తీవ్ర ఆవేధన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంట నేల పాలవడంతో తీవ్ర దుఖంలో రైతులు మునిగిపోయారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
దహెగాం, మే 6 : మండలంలో కరిసిన ఆకాల వర్షానికి కళ్లాల్లో ఆరపెట్టిన వరి ధాన్యం తడిసి ముద్ధయింది. మండలంలోని దహెగాం, లగ్గాం, ఒడ్డుగూడ, ఖర్జీ, గిరివెల్లి, చంద్రపల్లి, కొంచవెల్లి, హత్తిని, పీపీరావు కాలని గ్రామాల్లోని ధాన్యం తడిసింది. దీంతో రైతులు తడిసి ధాన్యంను ఆరపెట్టే పనుల్లో పడడంతో పాటు తీవ్ర నస్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.