తాండూర్ : మంచిర్యాల జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14,17 చెస్ బాలురు, బాలికల జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ( Chess Competitions ) ఆదివారం తాండూర్ మండల కేంద్రంలోని విద్యాభారతి హైస్కూల్లో నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాల పాఠశాలలకు చెందిన 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ పోటీల్లో ఎంపికైన క్రీడా కారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ జోనల్ టోర్నమెంట్లో పాల్గొంటారని క్రీడా సమాఖ్య ప్రతినిధి, ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎండీ యాకూబ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోటీల కన్వీనర్, పాఠశాల కరస్పాండెంట్ సురభి శరత్ కుమార్, పాఠశాల అకాడమీ డైరెక్టర్ సౌమ్య, ప్రినిపాల్ సరోజిని, పోటీల చెస్ ఆర్బిటర్స్ సమ్మయ్య, ఆకాష్, కార్తీక్, క్రీడల అబ్జర్వర్ పాశం శ్రీనివాస్, నిర్వాహక కార్యదర్శులు బాలకృష్ణ, రాజు, తారకేశ్వరి, వ్యాయామ ఉపాధ్యాయులు రాజమహమ్మద్, వహీదాబేగం, విశాల, వామన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.