దండేపల్లి, ఆగస్టు 18 : పుణ్యస్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు ద్వారక గోదావరిలో పడి మృత్యువాత పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దండేపల్లి మండలం కొండాపూర్ కు చెందిన అల్తాటి అజయ్(19), గంధం చరణ్(17) తమ కుటుంబ సభ్యులతో కలిసి ద్వా రక గోదావరికి వెళ్లారు. పవిత్ర స్నానం కోసం గోదావరిలోకి దిగగా, నీటి ఉధృతికి క్షణాల్లో కొట్టుకుపోయారు. కుటుంబ సభ్యులు, బం ధువులంతా అక్కడే ఉన్నా ఏమి చేయలేని పరిస్థితి.
గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం కోసం లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎదిగిన కొడుకులు కళ్లముందే చనిపోవడంతో కుటుం బ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గంధం చరణ్ తండ్రి చిన్నతనంలోనే చనిపో గా, తల్లి వసంత కష్టపడి పెంచింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.