ఇచ్చోడ, జూలై 23 : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో రెండు వేల మొక్కలు నాటారు. సర్పంచ్ గాడ్గె మీనాక్షి ఆధ్వర్యంలో వందశాతం మొక్కలను బతికిస్తామని గ్రామస్తులు ప్రమాణం చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని యేటా గ్రామంలో రెండు వేల మొక్కలు నాటుతున్నామన్నారు. ఇప్పటి వరకు పది వేల మొక్కలు నాటినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తంగా లక్ష మొక్కలు నాటినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గె సుభాష్, ఉప సర్పంచ్ వర్ష, వెంకటి, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
ముక్రా(కే) ఫొటోను ట్వీట్ చేసిన రాజ్యసభ సభ్యుడు
మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకోవడం విశిష్టమైన శైలి అని, ప్రతి ఒక్కరూ ముక్రా(కే) బాటలో నడువాలని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. ఆదివారం ముక్రా(కే) నాటిన మొక్కల ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ముక్రా(కే) గ్రామస్తులు కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా 2 వేల మొక్కలు నాటారు. ఈ మొక్కలు చెట్లుగా మారే వరకు సంరక్షిస్తామని ప్రమాణం చేశారని అన్నారు. పచ్చని, పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన భారతదేశానికి తోడ్పడదామని సర్పంచ్ గాడ్గె మీనాక్షి కృషి చాలా ప్రశంసనీయమంటూ రాజ్యసభ సభ్యుడు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.