ఇంద్రవెల్లి, జూన్ 18 ః ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని నర్సపూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాథోడ్ రామ్‌జీ(65), ఆడే ప్రకాశ్(56) మృతి చెందినట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. ఉట్నూర్ మండలంలోని పులిమడుగు గ్రామానికి చెందిన రాథోడ్ రామ్‌జీ, ఆడే ప్రకాశ్‌లు ద్విచక్ర వాహనంపై ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని టీలా శుభ కార్యక్రమానికి వెళ్తున్నారు.
ఇంద్రవెల్లి మండలంలోని నర్సపూర్ ఎక్స్‌రోడ్డు సమీపంలో ఉట్నూర్ వైపు నుంచి వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఆతివేగంగా ఢీ కొనడంతో రామ్‌జీ, ప్రకాశ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఇద్దరు రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. శవ పంచనామా నిర్వహించి పోస్ట్‌మార్టం చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారుకులైన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో విషాదం నెలకొన్నది.