సారంగాపూర్, ఫిబ్రవరి 17 ః చించోలి(బి) ఆర్ఆర్ గార్డెన్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ధని గ్రామానికి చెందిన మెంగ సాయన్న(50), అయిటి మహేందర్(45)లు మోటార్ సైకిల్‌పై ఉదయం నిర్మల్ మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని మధ్యాహ్నం సొంత గ్రామమైన ధనికి వస్తున్నారు. చించోలి(బి) గ్రామ సమీపంలో ఉన్న ఆర్ఆర్ గార్డెన్ దగ్గరకు రాగానే మోటార్ సైకిల్ అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. దీంతో మోటార్ సైకిల్ వెనుకభాగంలో కూర్చున్న మెంగ సాయన్న తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు.
మహేందర్‌కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స కోసం నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ సాయంత్రం చనిపోయాడు. ఈ మేరకు ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం సాయన్నకు భార్య నీత, కుమారులు సన్నిత్, వినిత్లు ఉన్నారు. ఇందులో పెద్ద కుమాడు సన్నిత్కు వివాహం కాగా రెండో కుమారుడు విరిత్ వివాహం కాలేదు. బతుకుదెరువు కోసం వినిత్ దుబాయ్‌కి వెళ్లాడు. భార్య నీత ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి దేవాలయానికి మొక్క తీర్చుకోవడం కోసం వెళ్లింది. సాయన్న తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించేవాడు. పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
మహేందర్ భార్యపైనే కుటుంబ భారం
మహేందర్‌కు భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వ్యసాయంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తనకున్న భూమిలో పత్తి, కందులు పండిస్తున్నాడు. పెద్దకుమార్తె పెండ్లి చేశాడు. రెండో కుమార్తె, కుమారుడి పెండ్లి కాలేదు. కుమారుడు ఇచ్చోడ గురుకులంలో చదువుతున్నాడు. ఇంటి యాజమాని రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. కుటుంబ భారమంతా ఆయన భార్య సుజాతపై పడింది.