పెంబి : నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని అటవీప్రాంతంలో అడవి పందుల ( Wild Boar Attack ) దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. మండలంలోని సక్కిగూడ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు సిడం లక్ష్మణ్, సిడం తుకారాం మంగళవారం అర్ధరాత్రి పంటకు కాపలా ఉండేందుకు ఎండ్లబండ్లపై బయలు దేరారు. గ్రామ శివారులో అడవి పందుల గుంపు ఒక్కసారిగా ఎదురు వచ్చి ఎడ్ల బండిపై దాడి చేశాయి. దీంతో ఎడ్ల బండి అదుపుతప్పి బోల్తాపడింది. దీనితో ఇద్దరికి కాళ్లు విరిగాయి. అంబులెన్స్‌కు సమాచారం అందించగా అంబులెన్సులో ఈఎంటీ కృష్ణ ప్రాథమిక చికిత్స అందించి బాధితులను నిర్మల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.