ఉట్నూర్, నవంబర్ 22 : లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసులు ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ధర్మయుద్ధం సభ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు లేని లంబాడాలను ఎస్టీ జాబితాలో కలిపినట్లు ఆరోపించారు. ఇటీవలే సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ రకంగా కలిపారో తెలుపాలని నోటీసులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వాలు స్పందించలేదని ఆరోపించారు. కుమ్రం భీం, రాంజీగోండ్ నాయకుల ఉద్యమాల ద్వారానే హక్కులు పొందుతున్నామన్నారు. అవి కాస్తా లంబాడాలు విద్య, ఉద్యోగాల్లో పూర్తి రిజర్వేషన్లు అనుభవిస్తూ తమకు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.
ఆదివాసీలకు ఉద్యమాలు కొత్తకాదని అవసరమైతే రక్తసిక్తంగా కూడా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. బ్రిటీష్ కాలంలో తమ ఆదివాసీ నాయకులు జల్, జంగల్, జమీన్ కోసం ఉద్యమాలు చేశారని, అప్పుడు లేని లంబాడాలు ఇప్పుడు ఏలా వచ్చారని ప్రశ్నించారు. ఎస్టీ హోదాలో ఉన్న ఆదివాసులు ఐఏఎస్, ఐపీఎస్, ఎంబీబీఎస్ వంటి ఉద్యోగాలు పొందకపోవడానికి లంబాడాలు రిజర్వేషన్లను పూర్తిగా వాడుకోవడమే కారణమన్నారు. ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమల చేసి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని బేల మండలంలో 100 పైగా కుటుంబాలు వలసవచ్చి ఎస్టీ హోదా అనుభవిస్తున్నారని గుర్తించి వారి సర్టిఫికెట్లు రద్దు చేయించామన్నారు. ఏజెన్సీ డీఎస్పీ నిర్వహించి ఆదివాసీ యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీల కేసుకు సంబంధించిన కేసులో భాగంగా సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు నోటీసుల విషయం నాకు తెలియదు. అటువంటి ఏమైన ఉన్నా ఆదివాసుల పెద్దలతో కలిసి సీఎం దగ్గరికి తీసుకెళ్తా.
ధర్మయుధ్దం సభలో ఆదివాసులు పలు తీర్మాణాలు చేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలి. 1956 కంటే ముందు జాబితాలను పరిశీలించి ఉద్యోగాలు ఇతర పథకాలు పొందుతున్నవారిపై చర్యలు తీసుకోవాలి. ఏజెన్సీలో పీసా చట్టం అమలు, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలి. పీవీటీజీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు, ఏజెన్సీలో చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలి. లంబాడాల చేర్చుపై సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులకు జవాబు తెలుపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో లంబాడాలను తీసుకోవద్దు. నీట్ ఇతర విద్యా అవకాశాలలో ఆదివాసులకే సీట్లు కేటాయించాలి. ఎస్టీ జాబితాలో లంబాడాలను తొలగించి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వారికి ఎస్టీ హోదా కల్పించొద్దని తీర్మాణాలు చేశారు.
ఉట్నూర్ డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాకపోవడంతో ఎక్కడి అక్కడ పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఉట్నూర్ ఎక్స్‌రోడ్ నుంచి ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వాహనాలు నడవడంతో ప్రయాణికులు అక్కడికి వెళ్లి బస్సులలో ప్రయాణించాల్సి వచ్చింది. బస్సులు సకాలంలో లేకపోవడంతో ప్రయాణికులు ఆటోలు, జీపులలో అధిక డబ్బులు చెల్లించి ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడింది. ఇక ఉట్నూర్ ఆదివారం సంత పూర్తిగా బంద్ ఉండడంతో ప్రజలు కూరగాయలు, సామాగ్రి దొరకక ఇబ్బందులు పడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అత్యవసర సమయంలో లంబాడాలను ఎస్టీ జాబితాలో కలుపడంతో ఆదివాసీ సమాజం పూర్తిగా నష్టపోయిందన్నారు. ఆదివాసీలు సుప్రీంకోర్టులో కేసు వేయగా తాజాగా అది ఈయరింగ్ జరిగిందన్నారు. ఎస్టీలో లంబాడాలను ఏ రకంగా కలిపారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందన్నారు. వాటిని ఈ ప్రభుత్వాలు ఇప్పటికి రిప్లే చేయలేదన్నారు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. జాతి కోసం హైదరాబాద్ సభకు, ఢిల్లీలో సభకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో లంబాడా అభ్యర్థిపై 23 వేల ఓట్లతో గెలిచానన్నారు. అయితే శ్యాంనాయక్, అతని భార్య రేఖానాయక్ ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలుసన్నారు. ఇక జాతికోసం పోరాటాలు చేస్తున్నామన్న సోయం బాపురావు, ఆత్రం సక్కులు ఎందుకు సభకు రాలేదో చెప్పాలన్నారు.
– ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ