కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 22 : ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాలలు రాష్ట్ర స్థాయి మారులు సాధించి విజయఢంకా మోగించాయని విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్‌లోని కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. సత్తాచాటిన విద్యార్థులను అభినందించి మాట్లాడారు.
కళాశాలల విద్యార్థుల ఫౌండేషన్ మెరుగుపరుస్తూ, కచ్చితమైన ప్రణాళికతో సిలబస్ పూర్తి చేసి తగినంత సమయం రివిజన్ కోసం ఉపయోగించడం వల్లే విద్యార్థులు రాష్ట్ర స్థాయి మారులు సాధించడానికి వీలయిందన్నారు. ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఒత్తిడిలేని విద్యా విధానం తమ ప్రత్యేకతని, విద్యార్థుల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించి సరిచేయడం ద్వారా ఉత్తమ మారులు సాధించడం వీలైందని తెలిపారు.
ఈ క్రమంలోనే ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ ఫలితాల్లో 470కి జీ మదురిమ 468, డీ సిరి వైష్ణవ్య, ఆర్ ఉమాదేవి, వికాశ సాహి, కే శశాంక్, ఎ లహరిక, ఈ అనూష, బీ వైష్ణవి, వీ అర్చన, మేకల వైష్ణవి, ఏ హారిక, కే శ్రీవర్ష, ఎస్ శ్రీజ, పీ రిషిక, జీ శరణ్య, ఫబిత ఐనాయత్, ఏం రశ్మిత, జీ నేహ, పీ నిఖిత 18 మంది విద్యార్థులు 467 మారులు, 45 మంది 466 పైన, 67 మంది 465 మారులపైన సాధించారన్నారు.
మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో పీ సహస్ర, ఎల్ హేమ నందిని 440 మారులకు 438 మారులు సాధించారని, జీ సౌమ్య, కే విజయలక్ష్మి, సీహెచ్ హాసిని ముగ్గురికి 437 మారులు, 16 మంది విద్యార్థులకు 436 మారులు, 21 మంది విద్యార్థులు 435 మారులు సాధించారన్నారు. సీఈసీ విభాగంలో వై వైష్ణవి 496 మారులు, డీ రాహుల్ 490 మారులు, ఆర్పీ దీపిక 490 మారులు సాధించినట్లు చెప్పారు. ఎంఈసీ విభాగంలో భువనవిజయ్ 479 మారులు, ఏ శ్రావణి 467 మారులు పొందారని వివరించారు.
అలాగే, ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో వీ రశ్మిత 995, జీ అజయ్, బీ హితేష్, సీహెచ్ బాలాజి, ఎం సంధ్య, కే ప్రణతి, కే సాయి సంహిత మొత్తం ఆరుగురు 994 మారులు, 11 మంది విద్యార్థులు 993 మార్కులు, 21 మంది 992 మార్కులు, 27 మంది 991 మార్కులు, 30 మంది విద్యార్థులు 990 మారుల పైన సాధించారని చెప్పారు. రెండో సంవత్సరం బైపీసీ విభాగంలో డీ జోత్స్నశ్రీ 996, వీ మహతి, కే పల్లవి 994 సాధించారన్నారు.
నలుగురు విద్యార్థులు 993 మారుల పైన, ఏడుగురు విద్యార్ధులు 992 మారులపైన, 12 మంది 991 మారులపైన 16 మంది 990 మారులపైన సాధించారని చెప్పారు. రెండో సంవత్సరం సీఈసీలో విభాగంలో ఏ శృతి 981, ఎంఈసీ విభాగంలో దేశక శర్మ 980 మారులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు.