కొండలు, గుట్టలు దాటితేనే.. బిందెడు నీళ్లు
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని గిరిజనులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. కొండలు, గుట్టలు, అభయారణ్యాలు దాటి జలాన్ని తెచ్చుకుంటున్నారు. కాలినడకన రెండు కిలోమీటర్లు నడిచి చెలిమల నుంచి నీటిని తోడుకుంటున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని మర్కాగూడ పంచాయతీ పరిధిలోని నవగూడ గ్రామానికి చెందిన కొలాం ఆదివాసులు కాలినడకన వెళ్లి దట్టమైన అటవీ ప్రాంతంలో బండల మధ్య చెలిమెల ద్వారా బిందెడు నీటిని తీసుకురావాల్సిన దుస్థితి నెలకొన్నది.
- రెండు కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకుంటున్న గిరిజనులు
- నిలిచిన మిషన్ భగీరథ నీరు.. బోరు బావి మంజూరు చేయాలని వినతి
- ఏజెన్సీలోని కోలాం ఆదివాసుల నీటి కష్టాలపై ఫొటో ఫీచర్
ఇంద్రవెల్లి, జూలై 18 ః ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని గిరిజనులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. కొండలు, గుట్టలు, అభయారణ్యాలు దాటి జలాన్ని తెచ్చుకుంటున్నారు. కాలినడకన రెండు కిలోమీటర్లు నడిచి చెలిమల నుంచి నీటిని తోడుకుంటున్నారు. ఇంద్రవెల్లి మండలంలోని మర్కాగూడ పంచాయతీ పరిధిలోని నవగూడ గ్రామానికి చెందిన కొలాం ఆదివాసులు కాలినడకన వెళ్లి దట్టమైన అటవీ ప్రాంతంలో బండల మధ్య చెలిమెల ద్వారా బిందెడు నీటిని తీసుకురావాల్సిన దుస్థితి నెలకొన్నది.
దీనికితోడు వర్షాకాలం కావడంతో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. అప్పుడప్పుడు వస్తే తాగడానికి కాకుండా ఇతర అవసరాల కోసం వినియోగిస్తామని పేర్కొంటున్నారు. తమ గ్రామానికి బోరు బావి మంజూరు చేయాలని అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఐటీడీఏ అధికారులు కొలాం ఆదివాసులపై దృష్టి సారించి, బోర్‌బావి మంజూరు చేయాలని కోలాం ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు.



Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

