పెంబి, జూన్ 11 : తరతరాలుగా నివసిస్తున్న తమ గ్రామాలను విడిచి వెళ్లె ప్రసక్తే లేదని, పునరావం పేరిట గ్రామాలను ఖాళీ చేయడం కంటే గ్రామాల్లోనే రోడ్లు, వంతెనలు, తాగునీరు, ఇండ్ల నిర్మాణాలు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులు పునరావాస ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న గుమ్మెన, ఎంగ్లాపూర్, చాకిరేవు, దొందారి గ్రామాల్లో నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీఎఫ్వో సుశాంత్ సుక్దేవ్ బోబడెలు పర్యటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యే, డీఎఫ్వో గుమ్మెన, ఎంగ్లాపూర్ గ్రామాల పునరావాసంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పునరావాసానికి తరలితే ఒక్కో యునిట్కు ఐదెకరాల వ్యవసాయ భూమి, ఇల్లు లేదా రూ.10 లక్షలు, ఇల్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. స్పందించిన అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి వాగులపై ఇనుప వంతెనలు, బీఎస్ఎన్ఎల్ టవర్, తాగునీరు సౌకర్యానికి తగిన చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎంహెచ్వో రాజేందర్, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, ఎఫ్డీవో శివకుమార్, ఎఫ్ఆర్వో కల్పనదేవి, నాయకులు గుడిసె రమేశ్, స్వప్నిల్రెడ్డి పాల్గొన్నారు.