జన్నారం, జనవరి 8 : మండలంలోని కొత్తపేట గ్రామ పంచాయతీలోని కొలాంగూడలో మడావి, ఆదిమ కొలాం గిరిజనుల కులదైవం భీమన్న దేవునికి సోమవారం మొక్కులు చెల్లించుకున్నారు. మూడు రోజుల క్రితం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం డోలిజెండాగూడ నుంచి కాలినడకన బయలుదేరిన గిరిజనులు సోమవారం ఇక్కడికి చేరుకొని భీమన్న దేవుని వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
గిరిజన సంప్రదాయం ప్రకారం కొత్త కోడళ్ల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మడావి బాపురావు, ఝాడు, ఆత్రం బొజ్జు, మాణిక్రావు, తదితరులు ఉన్నారు.