నార్నూర్, ఆగస్టు 09 : ఆదివాసీలు ఇప్పటికీ విద్య, వైద్య సేవలకు దూరంగా ఉన్నట్లు ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్ తెలిపారు. అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాన్ని శనివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు. ఆదివాసి పలెల్లో ఆదివాసి జెండాలను ఆవిష్కరించారు. ఆదివాసి హక్కులకి పోరాడిన మహనీయుల చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగోరావ్ మాట్లాడుతూ.. ఆదివాసి పల్లెలు నేటికి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మేస్రం రూప్ దేవ్, మూతి రామ్ పటేల్, ఏత్మారావ్, రూప్ దేవ్, భీం రావ్, నాగోరావు, ఆదివాసీ సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.