పీచర గ్రామానికి చెందిన యువకుడు సోమేశ్ ఆధ్వర్యంలో పలు గ్రామాల ఆదివాసీ యూత్ సభ్యులు బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి నేరడిగొండలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు.
మండలం లోని పీచర, గుత్పాల, రోల్మామడ, రేంగన్వాడీ, పిప్రి, మంగల్మోట, ఎల్లమ్మగూడ, గోదుమాల్, ధన్నూర్ గ్రామాలకు చెందిన ఆదివాసీ యువకులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్ పాల్గొన్నారు.
– నేరడిగొండ, ఆగస్టు 10