కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు పంటలకు హానికర రసాయనాలు, ఎరువులు వినియోగిస్తున్నారు. ఫలితంగా పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ దిగుబడులు మా త్రం ఆశించిన స్థాయిలో రాక రైతులు నష్టపోయి అప్పు ల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులు లేని ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించేందుకు ఐటీడీఏ చర్యలు చేపట్టింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో పైలట్ ప్రా జెక్టుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతా ల్లో గిరిజన రైతులకు శిక్షణ ఇచ్చి వారితో ‘ప్రకృతి వ్యవసాయం’ చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
కు మ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం గిరిజన రైతులు పత్తి, సోయ వంటి వాణిజ్య పంటలను మినహాయిస్తే జొన్న, మొక్క జొన్న వంటి పంటలను సహజ సిద్ధంగానే సాగుచేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో జొన్న, మొక్కజొన్న వంటి ఆహార పంటలకు రసాయన ఎరువులు, రసాయనాలు తక్కువగా వినియోగిస్తారు. పత్తి, వరి, సోయ, కూరగాయల సాగుకు రసాయన ఎరువులు, పురుగుల మందులను అధికంగా వినియోగిస్తున్నారు. దీంతో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి.
పెట్టుబడుల భారాన్ని తగ్గించేలా కేసీఆర్ సర్కారు రైతు బంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేసి రైతులను ఆదుకున్నది. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, ఆ యిల్ పాం, ఉద్యానవన పంటల సాగుకు ప్రత్యేక రా యితీలు అందించింది. బిందు సేద్యం వంటి పరికరాలను సబ్సిడీపై అందజేసింది. ప్రస్తుతం ఐటీడీఏ ఆధ్వర్యంలో వ్యవసాయంలో గిరిజన రైతుల పెట్టుబడులను తగ్గించి ఆరోగ్యకరమైన పంటల సాగును ప్రోత్సహించే విధంగా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు అమలు చేయనున్నది.
ప్రకృతి వ్యవసాయం సహజసిద్ధమైన విత్తనాలతోనే చేయాల్సి ఉంటుంది. రసాయన ఎరువులు, పురుగుల మందుల వాడకం ఏమాత్రం ఉండదు. దీంతో పెట్టుబడి తగ్గడంతో పాటు పోషక విలువలు కలిగిన ఆహార పంటలను ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పటికే సేంద్రియ వ్యవసా య పద్ధతుల్లో పంటలను సాగుచేసే రైతులను స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రోత్సహిస్తున్నది. ప్రస్తుతం ఐటీడీఏ పరిధిలోని అన్ని ఏజెన్సీ ప్రాం తాల్లో వీటిని అమలు చేయనున్నా రు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోనున్నది. ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో 500 మంది గిరిజన రైతులను ఎంపిక చేసి వారికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు.