జైనూర్, ఏప్రిల్ 10 : ఆదివాసీ సంస్కృతి ఎంతో గొప్పదని ఉత్తర్ప్రదేశ్రాష్ట్ర ప్రత్యేక బృంద సభ్యులు పేర్కొన్నారు. గురువారం మార్లవాయిలో పర్యటించారు. అడవిబిడ్డలు వారికి బొట్టుపెట్టి రుమాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. కుమ్రం భీం, హైమన్ డార్ఫ్ ఎలిజబెత్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం అక్కడి చేపట్టిన అభివృద్ధి పనుల గురించి డీఆర్డీవో దత్తరాం, జడ్పీ సీఈవో లక్ష్మీ నారాయణ, డీపీవో భిక్షపతిగౌడ్ వారికి వివరించారు. శ్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, పల్లె ప్రకృతి వనం, డిజిటల్ లైబ్రరీ, హైమన్ డార్ఫ్ మ్యూజియం, నర్సరీ తదితర అభివృద్ధి పథకాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఐకేపీ, ఈజీఎస్, గ్రామ పంచాయతీల్లో చేపట్టే కార్యక్రమాలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మార్లవాయి గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ బీర్షావ్, ఐకేపీ ఉద్యోగి రాజ్‌కుమార్, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో నగేశ్, ఎంపీవో మోహన్, పంచాయతీ కార్యదర్శి మనోజ్, గ్రామ పటేల్ ఆత్రం భగవంతు రావు, గ్రామస్తులు కనుక గణపతి, ప్రతిభ, వెంకటేశ్, జమున, సావిత్ర, ఐకేపీ సీసీలు, వీవోఏలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.