నస్పూర్, జూన్ 17 : స్థానిక కలెక్టరేట్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్‌గా పనిచేసి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన బదావత్ సంతోష్‌ను సోమవారం టీఎన్జీవో నాయకులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, కార్యదర్శి రామ్మోహన్, పొన్న మల్లయ్య, బాపురావు, శ్రీనివాస్, తిరుపతి, శ్రావణ్, గోపాల్, సుమన్, సప్దర్ అలీ పాల్గొన్నారు.
ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ బదావత్ సంతోష్‌ను జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, డీపీవో వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఎంపీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు బాపురావు, డీఎల్పీవో సప్దర్ ఆలీ, ఎంపీవోలు సత్యనారాయణ, నాగరాజు,కార్యదర్శులు శ్రావణ్, సుమన్, శ్రీనివాస్, నవ్య, క్రాంతి పాల్గొన్నారు. అలాగే డీఎం హెచ్‌వో అనిత, విశ్వేశ్వర్‌రెడ్డి, మాస్ మీడియా అధి కారి బుక్కా వెంకటేశ్వర్, చారి, సాయి బదావత్ సంతోష్‌ను సన్మానించారు.