శ్రీరాంపూర్, జూలై 13 : శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7గనిలో నార్త్ ఉత్పత్తి పనిస్థలాల్లో ఉత్పత్తి నిలిపి వేయాలని కేంద్ర ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. నార్త్ భాగంలో బొగ్గు ఉత్పత్తికి 2020 వరకే అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
2019 నుంచి గని విస్తరణకు అనుమతి కోసం కేంద్ర ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్‌కు సింగరేణి యాజమాన్యం 4 సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ రిజెక్ట్ చేస్తున్నారని తెలిసింది. అనుమతి వచ్చే వరకు ఉత్పత్తి నిలిపివేయాలని అధికారులు శనివారం ఆదేశించారని సమాచారం. నార్త్ పనిస్థలాల్లో ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు 300 మంది ఉద్యోగులను ఇతర గనులకు తాత్కాలికంగా డిప్యూటేషన్‌పై బదిలీ చేయనున్నారు. నెల రోజుల్లో తిరిగి బొగ్గు ఉత్పత్తికి అనుమతలు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు తిరిగి కార్మికులను ఆర్కే 7గనికి తీసుకుంటామని జీఎం సంజీవరెడ్డి పేర్కొన్నారు. .
-టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7 గనిలోని నార్త్ భాగంలో ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వడంలో జాప్యంతో నేడు గని మూసి వేయాల్సి వచ్చిందని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సురేందర్‌రెడ్డి ఆరోపించారు. డిప్యూటేషన్‌పై బదిలీ చేస్తుండడంపై కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో అధికార పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీలు అనుమతులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.