బెల్లంపల్లి/కాగజ్‌నగర్/తాండూర్, ఫిబ్రవరి 8 : ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నందున 10 నుంచి 20వ తేదీ వరకు సిర్పూ ర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు చీఫ్ కమర్షియల్ అధికారి కైలాస్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు వరకు నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలుకు లింకు ఉండడంతో రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు, కొన్నింటిని రీ షెడ్యూల్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచిర్యాల మీదుగా నిత్యం వేలాది మంది ప్రయాణికు లు సికింద్రాబాద్, కాజీపేట్ వైపు వెళ్తుంటా రు. ఇప్పటికే మూడోలైన్ పనులు, ఇతర మరమ్మతుల కారణంగా రెండేళ్లుగా చాలా రైళ్ల ర ద్దు కావడమేగాక దారి మళ్లించారు.
ఈ ప్రాం త ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దుతో 11 రోజుల పాటు అవస్థలు తప్పలా లేవు. ఇవే కాకుండా కొచ్చి నుంచి కోబ్రా ఎక్స్‌ప్రెస్(22648) ఈనెల 11, 14,18 తేదీల్లో రద్దు చేశారు. కోట్రా నుంచి కొచ్చి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12500) ఈ నెల 15, 17 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. గోరఖ్‌పూర్ నుంచి కొచ్చికి వెళ్లే రఫ్తిసాగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12512) రూటును మళ్లించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. అయితే ఎకడో ఖమ్మంలో రైల్వే మార్గం పనులు జరిగితే ఇకడ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయడమేమిటని తాండూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త కామని శ్రీనివాస్ ప్రశ్నించారు. గోలొండ ఎక్స్‌ప్రెస్‌తో భాగ్యనగర్ రైలుకు లింక్ ఏమిటో అర్థం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. భాగ్యనగర్, గోలొండ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిపించేలా చూడాలని, ఇందుకు రైల్వే అధికారులు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.