కొమురం భీం ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ (Asifabad district ) జిల్లాలోని వాంకిడి మండలంలో విషాదం (Tragedy ) చోటు చేసుకుంది. మండలంలోని ధాబా గ్రామంలో నీటి మడుగులో పడి నలుగురు మృతి చెందారు . గ్రామానికి చెందిన మోర్లే నిర్మలా భాయి ( 35) పొలం పనులకు వెళ్తూ వెంట కుమారుడు మోర్లే గన్ను(12), మరో కుటుంబానికి చెందిన వాడే మహేశ్వరీ(9), శశికళ(9) తీసుకెళ్లింది.
అయితే సమీపంలో ఆడుకుంటూ వాగు వద్దకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునగగా, వారిని కాపాడే ప్రయత్నంలో తల్లి నిర్మలాభాయి కూడా వాగులో పడి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు.