విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ట్రాక్టర్ దహనం.. నిలదీసిన గ్రామస్థులు
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చలాపూర్ గ్రామంలో విద్యుత్ ప్రమాదం తో ఆదివారం ట్రాక్టర్ దహనం అయ్యింది.
తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చలాపూర్ గ్రామంలో విద్యుత్ ప్రమాదం ( Electricity Incident ) తో ఆదివారం ట్రాక్టర్ దహనం ( Tractor Gutted ) అయ్యింది. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన విద్యుత్ అధికారులను గ్రామస్థులు నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో వేలాడే కరెంట్ తీగలు, వంగిన స్తంభాల కారణంగానే ప్రమాదం సంభవించిందని, పేద రైతు ట్రాక్టర్ దహనమైందని ఆరోపించారు. విద్యుత్ శాఖ ఏఈ జాన్, లైన్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, జూనియర్ లైన్మెన్ మహదేవ్‌ను మూడు గంటల పాటు అడ్డగించి పరిహారం కోసం డిమాండ్ చేశారు. గ్రామంలో దాదాపుగా 15 దారుల్లో విద్యుత్ తీగలు వేలాడుతూ వాహనాలకు, ఎడ్ల బండ్లకు కూడా తాకే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
మరమ్మతులు చేపట్టాలని కొన్ని నెలలుగా చెబుతున్నప్పటికీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తాండూర్ ఎస్సై కే ప్రసాద్ అక్కడకు చేరుకుని అటు స్థానికులతో, ఇటు అధికారితో మాట్లాడారు. రెండు, మూడు నెలల్లో ట్రాక్టర్ యజమానికి పరిహారం ఇప్పించడానికి ప్రతిపాదనలు పంపిస్తామని డీఈఈ ఫోన్లో చెప్పడంతో స్థానికులు శాంతించారు.
ఈ వర్షాకాలం ప్రారంభానికి ముందే గ్రామంలో విద్యుత్ లైన్ల పూర్తి స్థాయి మరమత్తులు పూర్తి చేసి ప్రమాధాలు జరగకుండా చూడాలని కోరారు. అచ్చలాపూర్ ఉప సర్పంచ్ గట్టు సంతోష్ కుమార్, నాయకులు మారిశెట్టి శ్రీనివాస్, కొండ సాయి, మాజీ ఉప సర్పంచ్ అడువాల సత్యనారాయణ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

