e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, January 21, 2022
Home ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు అంతాసిద్ధం

ఎమ్మెల్సీ ఎన్నికకు అంతాసిద్ధం

రేపు స్థానిక సంస్థలఎమ్మెల్సీ పోలింగ్‌
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 8 కేంద్రాలు
నేడు ఆదిలాబాద్‌ టీటీడీసీలో సామగ్రి పంపిణీ

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు పోలింగ్‌ జరుగనుండ గా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఎనిమిది పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 937 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. మున్సిపాలిటీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు ఎక్స్‌ అఫీషియో సభ్యులు, ఎంపీ, ఎమ్మెల్సీలు ఓటు వేసే అవకాశం ఉంది. 308 మంది కౌ న్సిలర్లు, 554 మంది ఎంపీటీసీలు, 65 మం ది జడ్పీటీసీలు, 10 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు ఉన్నారు. వీరు తమకు సమీప ప్రాం తాల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నాలుగు జిల్లాల్లో.. జిల్లాకు రెండు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో పాత జిల్లా పరిషత్‌ సమావేశం భవనం, ఉట్నూరు మండల పరిషత్‌ కార్యాలయం, మంచిర్యాల జిల్లాలో జిల్లా పరిషత్‌ పాత సమావేశ మం దిరం మొదటి అంతస్తు, బెల్లంపల్లి ఎంపీపీ సమావేశ భ వనం, నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయం, భైంసా మండల పరిషత్‌ కార్యాల యం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని జి ల్లా పరిషత్‌ బాలికల పాఠశాల, కాగజ్‌నగర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎన్నికల పోలింగ్‌ జరగనున్నది. 64 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. వీరిలో జోనల్‌ అధికారులు 12 మంది, మైక్రో అబ్జర్వర్లు 12 మంది, పోలింగ్‌ అధికారులు, సిబ్బంది 40 మంది ఉన్నారు.
నేడు సామగ్రి పంపిణీ..
రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనుండగా, నేడు ఆదిలాబాద్‌ టీటీడీసీలో అధికారు లు ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌ సామగ్రి పం పిణీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 8 పోలింగ్‌ కేంద్రాల సిబ్బందికి ఇక్కడే సామగ్రి అందిస్తారు. ఇందుకోసం అధికారులు ఏర్పా ట్లు చేశారు. బుధవారం రిటర్నింగ్‌ అధికారి సిక్తాపట్నాయక్‌, ఎస్పీ రాజేశ్‌చంద్ర పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఎన్నికల సామగ్రిని తీసుకునే సిబ్బంది సాయంత్రం లోగా తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటారు. శుక్రవారం ఉదయం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంటారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రతి పోలింగ్‌ కేంద్ర వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. వైద్యసిబ్బంది థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. ఓటర్లు తప్పనిసరి మాస్కులు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారు ఏవరైనా ఉంటే పీపీఈ కిట్‌లు ధరించి ఓటు వేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
టీఆర్‌ఎస్‌కు భారీ విజయం
ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన 24 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గెలిచే అవకాశాలు లేనందున బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులతో నామినేషన్‌ వేయించలేదు. నవంబర్‌ 26 వరకు గడువు ముగియగా, 22 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండె విఠల్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థి పుష్పరాణి పోటీలో నిలిచారు. ఎన్నికల్లో 937 మంది ఓటర్లు ఉండ గా, టీఆర్‌ఎస్‌కు చెందిన వారు 800 వరకు ఉ న్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండె విఠల్‌ భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement