చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చెప్పుకునే విజయదశమి వచ్చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో శనివారం వేడుకలు జరుపుకునేందుకు ప్రజానీకం సిద్ధమైంది. ఇక విద్యుత్ దీపాలతో ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగా, కొత్త శోభ సంతరించుకున్నది. పలుచోట్ల రావణాసుర దహనం పేరిట ‘రామ్లీల’ నిర్వహించేందుకు భక్తజనం అన్ని ఏర్పాట్లు చేసింది.
– చెన్నూర్ టౌన్, అక్టోబర్ 11