
ఆదిలాబాద్ రూరల్ / ఉట్నూర్ రూరల్, డిసెంబ ర్ 6 : ప్రభుత్వ కళాశాలలకు వచ్చే విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని కళాశాల, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్‌గాంధీ పాలిటెక్నిక్, ప్రభు త్వ డిగ్రీ కళాశాలల, ఇంద్రవెల్లి డిగ్రీ కళాశాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలల్లో రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల వివరాలపై ఆరాతీశారు. మరింత మందికి అడ్మిషన్లు ఇచ్చేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్ కోసం ప్రత్యేక కోర్సులను ప్రారంభించేలా చూడాలన్నారు. చదువుతో పాటు కోకరిక్యూలమ్ (ఇతర యాక్టివిటీ)ల్లోనూ ప్రోత్సహించాలన్నారు. నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి వారికి ప్లేస్‌మెంట్స్ కలిపించేలా చూడాలని పేర్కొన్నారు. గత ఏడాది డిగ్రీ కళాశాల నుంచి ఐసీఐసీఐకి 25 మంది, ఎటిరోకు 45మంది ఎం పిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంత రం కళాశాలలో విద్యార్థులతో మాట్లాడారు. అవకాశాలను అం దిపుచ్చుకోవాలని సూచించారు. అంతకుముందు ఎన్సీసీ కెడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. లాల్టెక్డిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళా శాలను తనిఖీ చేసి కళాశాలను పరిశీలించి సమ స్యలు అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరాతీశారు. అనంతం గిరిజన నిరుద్యోగులకు అందించిన న్యాప్కిన్, పల్లిపట్టీ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఐటీడీఏ పీవో అంకిత్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ భరద్వాజ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రహత్ ఖానమ్ పాల్గొన్నారు.