జైనూర్ : అధికారంలోకి రాకముందు ఒకమాట, వచ్చిన తరువాత మరోమాటతో మోసం చేస్తున్న కాంగ్రెస్ ( Congress ) పార్టీపై విసిగి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్( BRS ) లో చేరారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం కాలేజీగూడాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం వివిధ గ్రామాలకు చెందిన పలువురు ఉపసర్పంచులతో పాటు మరో 70 మంది బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ( MLA Kova Laxmi ) వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుతో ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. రావుజీగూడ ఉప సర్పంచ్ పెందూర్ గంగామణి, పవర్ గూడా ఉపసర్పంచ్ కరాడ్ లక్షింభాయి,
వార్డు మెంబర్లు, నసు, ఇసాక్, జమీర్, దినేష్ బీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మరుస్కోల సరస్వతి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్ రావు, మాజీ సహకార సంఘం చైర్మన్ హన్ను పటేల్, పార్టీ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాల, సర్పంచులు కొడప ప్రకాష్, మాడవి కౌసల్య, మాజీ సర్పంచ్ మాడవి, మాజీ ఎంపీటీసీ కుమ్ర భగవంత్ రావు తదితరులు పాల్గొన్నారు.