తాండూర్ : మండలంలోని అచ్చలాపూర్ గ్రామ పంచాయతీ పరిధి కొమ్ముగూడెంలో ఆదివారం రాత్రి పోచమ్మ విగ్రహాన్ని ( Pochamma statue) దుండగులు ధ్వంసం చేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామం సమీపంలోని చెరువు కట్ట దగ్గర చెట్టు కింద పోచమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. ఆలయంలో పోచమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు గ్రామస్థులు ఏర్పాట్లు చేసుకుంటుండగా రాత్రి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు గ్రామస్థులు తాండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.